శ్రీ అష్ట లక్ష్మీ స్తోత్రం~ ashtalakshmi stotram lyrics in telugu

Last Updated on April 19, 2021 

శ్రీ అష్ట లక్ష్మీ స్తోత్రం : read shri ashtalakshmi stotram in telugu with lyrics.

ఆదిలక్ష్మీ
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే
మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే
జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || ౧ ||

ధాన్యలక్ష్మీ
అయి కలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రితపాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౨ ||

ధైర్యలక్ష్మీ
జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రితపాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౩ ||

గజలక్ష్మీ
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజతురగపదాతిసమావృత పరిజనమండిత లోకనుతే |
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారణపాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౪ ||

సంతానలక్ష్మీ
అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషితగాననుతే |
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందితపాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి సదా పాలయ మామ్ || ౫ ||

విజయలక్ష్మీ
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదినమర్చిత కుంకుమధూసరభూషితవాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవవందిత శంకరదేశిక మాన్యపదే
జయ జయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || ౬ ||

విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే |
నవనిధిదాయిని కలిమలహారిణి కామితఫలప్రదహస్తయుతే
జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || ౭ ||

ధనలక్ష్మీ
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభినాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే |
వేదపురాణేతిహాససుపూజిత వైదికమార్గప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౮ ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Namaskaram! 🙏Om Namah Shivaya 😇
%d bloggers like this: