నవగ్రహ స్తోత్రం~ navagraha stotram lyrics, meaning in telugu

Last Updated on April 16, 2021 

నవగ్రహ స్తోత్రం read navagraha stotram daily meanings in telugu. This mantras help to reduce negative effects of planets.

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||

తాత్పర్యం:

మందార చెట్టు పువ్వు రంగుతో సమానమైనవాడు. కాశ్యప వంశంలో జన్మించినవాడు. గొప్ప కాంతి కల్గినటువంటివాడు. చీకటికి శత్రువు అయినటువంటివాడు. అన్ని పాపాలను పోగేట్టివాడు అయిన సూర్యభగవానుని నమస్కరించుచున్నాను.

చంద్రః
దథిశజ్ఞ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ |
నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్ ||

తాత్పర్యం:

పెరుగు, శంఖం, మంచుతో సమానమైన తెలుపు రంగు కలవాడు. తెల్లని పాల సముద్రం నుండి పుట్టిన వాడు. శివుని యొక్క కిరీటపు అలంకారం. కుందేలును చిహ్నంగా కలిగిన వాడు. ఉమ తో కూడిన శివుని మూర్తులలో ఒకడు అయిన చంద్రునికి నమస్కరిస్తున్నాను.

కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||

తాత్పర్యం:

భూమికి జన్మించినవాడు. మెరుపు వంటి తేజస్సును కలవాడు. బాలుడు శక్తిని హస్తమునందు కలవాడు ఐన శుభము మరియు క్షేమము ఇచ్చే కుజుడికి(అంగారకుడికి) నేను నమస్కరిస్తున్నాను.

బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||

తాత్పర్యం:

కదంబ వృక్షపు మొగ్గ వలే ఆకుపచ్చని రంగును కలవాడు. తన ఆకారంతో ఎవరితో సాటిలేనివాడును. దేవతగలవాడు ఐన, సత్వ గుణములతో కూడిన వాడు అయిన బుధుడికి నేను నమస్కరిస్తున్నాను.

గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||

తాత్పర్యం:

ఆడించేటువంటి దేవతలకి, జ్ఞానసారం పొందిన ఋషులకు సర్వార్థములు బోధించే గురువుకి, బంగారు వర్ణం తో సమానమైన కాంతి కలవానికి, బుద్ధి కలవారిలో శ్రేష్ఠునకు,మూడు లోకములకు ప్రభువైన,  బృహత్తులకు అధిపతి అయిన బృహస్పతికి నమస్కరించుచున్నాను.

శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||

తాత్పర్యం:

చల్లని మంచులా, మొల్లపుష్పంలా, తమరతాడులా పోలిక కలిగినవాడు  రాక్షసులకు శ్రేష్ఠుడైన గురువు, అన్ని శాస్తములను చక్కగా మాట్లాడువాడు అయిన శుక్రునికి నేను నమస్కరిస్తున్నాను.

శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||

తాత్పర్యం:

నల్లని కాటుక రంగుతో సమనమైన కాంతి కలవాడు, సూర్యుని కుమారుడు, యమునికి సోదరుడు, ఛాయాదేవి – సూర్యునికి జన్మిణిచినవాడు అయిన నెమ్మదిగా కదిలే శనీశ్వరునికి నమస్కరిస్తున్నాను.

రాహుః
అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||

తాత్పర్యం:

సగం శరీరం కలవాడు, మహావీరుడు, చంద్రుడిని, సూర్యుడిని కబళించివిడుచువాడు. సింహిక గర్భమున జన్మించినవాడు అయిన అటువంటి రాహు గ్రహమునకు నేను నమస్కరిస్తున్నాను.

కేతుః
ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

తాత్పర్యం:

మోదుగ పువ్వు వర్ణం తో సమనమైన పోలిక కలవాడు, నక్షత్రాలకు, గ్రహాలకు శిరస్సువలే ఉండేవాడు,
భయంకరమైన, తీక్షతతో కూడినవంటివాడు, భయం కలిగించేది అయిన కేతు గ్రహంకు నమస్కరిస్తున్నాను.

ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి ||

నర నారీ నృపాణాం చ భవే ద్దుస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ||

గ్రహ నక్షత్రజాః పీడా స్తస్కరాగ్ని సముద్భవాః |
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే నసంశయః ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Namaskaram! 🙏Om Namah Shivaya 😇
%d bloggers like this: